Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'సూర్యాస్తమయం'. బండి సరోజ్ దర్శకుడు. శ్రీహార్‌సీన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై క్రాంతి కుమార్ తోట నిర్మిస్తున్నారు.
గురువారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో టైలర్‌ను దర్శకుడు వి.సముద్ర, ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'ట్రైలర్ చూసిన తర్వాత ఇదేదో మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమా అనే ఫీల్ వస్తుంది. కానీ నిజానికి ఇది ఫ్రెండ్షిప్ బేస్డ్ చిత్రం. మా చిత్రంలో నటిస్తున్న పెద్ద వంశీ, పాపులర్ విలన్ డానియల్ బాలాజీకి స్పెషల్ థ్యాంక్స్. బండి సరోజ్ అద్భుతంగా తీశాడు. ఈ నెలాఖరులో సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.