Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షకలక శంకర్, సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కార్పొరేటర్'. సంజరు పూనూరి దర్శకుడు. సమీప మూవీస్, యు అండ్ ఐ స్టూడియోస్ పతాకాలపై ఎ. పద్మనాభిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్న ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ,'ట్రైలర్లో నా యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని చాలా మంది ఫోన్స్ చేసి, ప్రశంసిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని తెలిపారు.
చిత్ర దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. వినోదానికి పెద్ద పీట వేస్తూనే అంతర్లీనంగా ఓ మంచి సందేశం కూడా చెప్పే ప్రయత్నం చేశాం. ఇందులో ఉన్న 5 పాటలు, 4 ఫైట్స్ అందర్నీ అలరిస్తాయి. ట్రైలర్‌కు సర్వత్రా అనూహ్య స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది' అని తెలిపారు.