Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కెరీర్లోనే కాదు రవితేజ కెరీర్లోనూ 'ఖిలాడి' భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాలో సరికొత్త రవితేజని చూడబోతున్నారు' అని అంటున్నారు దర్శకుడు రమేష్‌వర్మ. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'రాక్షసుడు'తో ఘన విజయాన్ని అందుకున్న రమేష్‌వర్మ లేటెస్ట్గా రవితేజతో 'ఖిలాడి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేడు (ఆదివారం) రమేష్ వర్మ బర్త్‌డే.
ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ''ఖిలాడి' సినిమాకి స్ఫూర్తి ఏమీ లేదు. ఇది మా సొంత కథతో చేస్తున్న సినిమా. తమిళ సినిమాకి రీమేక్ కాదు. కథాపరంగా మంచి స్పాన్ ఉన్న సినిమా. అలాగే టెక్నికల్‌గానూ చాలా బాగుంటుంది. నా కెరీర్లోనే కాదు, రవితేజ కెరీర్లోనూ ఇది భారీ బడ్జెట్ చిత్రం. రూ. 65 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో సరికొత్త రవితేజని చూస్తారు. అయితే ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక త్రిపాత్రాభినయం చేస్తున్నారా అనేది ఇప్పుడు చెప్పలేను. వెండితెర మీద చూస్తే మీరే థ్రిల్ ఫీలవుతారు. అలాగే అనసూయ, వెన్నెలకిషోర్ సహా అన్నీ పాత్రలు కథలో కీలకంగా ఉంటాయి. హైదరాబాద్, దుబారు, ఇటలీల్లో చిత్రీకరించాం. కొనేరు సత్యనారాయణగారు నాపై నమ్మకంతో 'రాక్షసుడు' సినిమాని రీమేక్ చేసే అవకాశం ఇచ్చారు. 'రాక్షసుడు2' కోసం విజరు సేతుపతితో మాట్లాడాం. ఆయన వెయిట్ చేయమన్నారు. సరైన సమయంలో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తాం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని చేయబోతున్నాం. అలాగే దర్శకుడు మారుతి, నేను కలిసి వరలక్ష్మి శరత్ కుమార్‌తో ఓ సినిమా నిర్మించాలనుకున్నాం. దీనికి ఇంకా టైమ్ పడుతుంది. నా కెరీర్లో 'రాక్షసుడు'కి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. ఈ సినిమా సాధించిన ఘన విజయం తర్వాతే డైరెక్టర్‌గా ఫుల్ ఫోకస్డ్గా రంగంలోకి దిగాను' అని అన్నారు.