Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతూ బ్రేవ్ హార్ట్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించబోతున్న చిత్రం 'సైదులు'. అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభించు కోనున్న ఈ చిత్ర టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సైదులు' టైటిల్ చాలా క్యాచీగా ఉంది. కథ విన్నాను. కాన్సెప్ట్ చాలా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు.
చిత్ర దర్శకుడు బాబా పి.ఆర్ మాట్లాడుతూ, 'మా సినిమా టైటిల్ లోగోని హీరో శ్రీకాంత్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రీ -ప్రొడక్షన్ పూర్తయింది. అక్టోబర్లో చిత్రీకరణ స్టార్ట్ చేసి, సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తాం' అని తెలిపారు.