Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి పుట్టినరోజు (ఆదివారం) సందర్భంగా చిరంజీవి తనయ సుస్మిిత కొణిదెల రూపొందిస్తున్న కొత్త చిత్రాన్ని శనివారం ప్రకటించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై 'శ్రీదేవి శోభన్‌బాబు' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్, జానులో చిన్ననాటి సమంత పాత్రలో నటించి గౌరి జి.కిషన్ జంటగా నటిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ బర్త్‌డే నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తోపాటు ప్రోమోని కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. 'కలర్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంతో సుస్మిత కొణిదెల తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం' అని చిత్ర యూనిట్ ప్రకటించింది.