Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమెడియన్ సత్య హీరోగా నటించిన చిత్రం 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ నాయిక. హీరో సందీప్ కిషన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. రామ్ అబ్బరాజు దర్శకుడు. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్‌కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. 'కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథే ఈ సినిమా. లాక్డౌన్లో ఇంటి నిండా బంధువులు ఉండిపోవడంతో పిసినారి పెళ్లి కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో ఆద్యంతం నవ్వించేలా ఈ సినిమాలో చూపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ బోలెడన్ని నవ్వులు పంచింది. తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంచ్ అవుతున్న 'సోని లివ్', తొలి చిత్రంగా దీన్ని ఈనెల 27న స్ట్రీమింగ్ చేయబోతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుందని 'సోని లివ్' ఆశిస్తోంది' అని చిత్ర యూనిట్ పేర్కొంది.