Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి త్వరలోనే 'గాడ్ ఫాదర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న 153వ చిత్రానికి 'గాడ్ ఫాదర్' టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలు.
నేడు (ఆదివారం) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరంజీవి తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ సరికొత్త శక్తివంతమైన క్యారెక్టర్ చేయబోతున్నారని టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ తెలియజేస్తున్నాయి. 'మెగాస్టార్ పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే పవర్ఫుల్ టైటిల్ పక్కా యాప్ట్. టైటిల్‌కి, మోషన్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇన్టెన్స్ పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ మోహన్‌రాజా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. చిరంజీవి, తమన్ కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రమిది. దీంతో తమన్ చాలా ఎగ్జైట్మెంట్తో స్వరాలను సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ కంపోజిషన్‌ను కూడా తమన్ పూర్తి చేశారు. ఎన్నో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌కు వర్క్ చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ నిరవ్‌షా విజువల్స్ ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవిపై చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వస్తున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.