Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్‌కళ్యాణ్, రానా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'భీమ్లానాయక్'. సితార ఎంటర్ టైన్మెంట్స్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. షూటింగ్ విరామ సమయంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను శనివారం 'షూటింగ్ విరామంలో 'భీమ్లా నాయక్'' అంటూ చిత్ర బృందం రిలీజ్ చేసింది. రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా పవన్‌కళ్యాణ్ నాన్‌స్టాప్‌గా బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ, ''షూటింగ్ విరామంలో 'భీమ్లా నాయక్' అంటూ రిలీజ్ చేసిన వీడియోకి టెర్రిఫిక్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. పవర్‌స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నాం. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని చెప్పారు.