Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాన్ ఇండియా సినిమాగా 'కేజీఎఫ్' ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. భారీ అంచనాలతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్2' రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి దక్షిణాది భాషల శాటిలైట్ రైట్స్‌ను 'జీ' నెట్వర్క్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఇవీపీ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్( జీల్) క్లస్టర్ హెడ్ సౌత్ బిజినెస్ సీజు ప్రభాకరన్ మాట్లాడుతూ, 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు, జీ కన్నడ, జీ తమిళ్, జీ కేరళమ్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఛానల్ అభిమానులకు మమ్మల్ని ఇంకా దగ్గర చేస్తుందని భావిస్తున్నాం' అని చెప్పారు. తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, ''కె.జి.ఎఫ్ 2' వంటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్లాక్‌బస్టర్ చిత్రాలతో మా అనుబంధం ఇంకా బలపడనుంది' అని అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ''కె. జి. ఎఫ్ 2' శాటిలైట్ హక్కులు జీ సొంతం చేసుకున్నందుకు, అలాగే వారి ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు మేం ఇంకా దగ్గరవుతునందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరి అంచనాలకు మించి 'కె.జి.ఎఫ్' లెగసిని ఇంకో స్థాయికి 'కె.జి.ఎఫ్ 2' తీసుకెళ్తుందని నా నమ్మకం' అని తెలిపారు.
నిర్మాత విజయ్ కిర్గందూర్ మాట్లాడుతూ, 'జీ నెట్‌వర్క్‌తో అసోసియేషన్ అవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది. మా హౌంబలే ఫిల్మ్స్ ఎప్పుడూ కథకు ప్రాధాన్యతనిస్తూ, అందరిని ఆకట్టుకునేలా రూపొందించడానికి ప్రయత్నిస్తుంది' అని చెప్పారు. హీరో యష్ మాట్లాడుతూ, ''కె.జి.ఎఫ్2' కి నా హదయంలో ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజరు కిర్గందూర్, నేను నమ్మిన కథను ప్రేక్షకులు ఇంతలా ఆదరించినందుకు కతజ్ఞతలు' అని చెప్పారు. హౌంబలే ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో శ్రీనిధి శెట్టి, సునీల్ దత్, రవీనా టాండన్ ప్రధాన పాత్రలు పోషించారు.