Authorization
Mon Jan 19, 2015 06:51 pm
70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా రూపొందిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. కరుణ కుమార్ దర్శకత్వంలో విజరు చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినీ అతిరథుల సమక్షంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఎన్ కన్వెన్షన్‌లో చిత్ర యూనిట్ వైభవంగా నిర్వహించింది.
ఈ చిత్ర బిగ్ టికెట్‌ను హీరో సుధీర్ బాబు తల్లిదండ్రులు విడుదల చేయగా, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో కార్తికేయ ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేశారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ,'ఈ రోజు నేను ఈ వేదిక మీద నిలబడ్డానికి 'పలాస' సినిమానే కారణం. ఆ సినిమా అవకాశం ఇచ్చిన అట్లూరి వరప్రసాద్‌కి ధన్యవాదాలు. చిన్నప్పటి నుండి మణిశర్మ గారి పాటలు వింటూ పెరిగాను. ఆయనతో ఈ సినిమాకి పని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆయన నన్ను తమ్ముడిలా ఆదరించి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమా ఓటీటీలో చూసే సినిమా కాదు, అందరూ ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్‌లో మాత్రమే చూడదగ్గ సినిమా' అని చెప్పారు. 'మా సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేయగానే బిజినెస్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగానే తెలుగు తమిళం, మలయాళం, కన్నడ, హిందీల్లో కూడా బిజినెస్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత దర్శకుడికి చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. సినిమా చాలా బాగా వచ్చింది. అమెరికాలో 120 థియేటర్స్‌తోపాటు కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27న వస్తున్న మా సినిమా అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది' అని నిర్మాతలు విజరు చిల్లా, శశి దేవిరెడ్డి అన్నారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ, 'ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడుకి సూరిబాబు, శ్రీదేవి జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి. వాళ్ల కోసం మళ్ళీ ఈ సినిమా చూడ్డానికి థియేటర్‌కు వస్తారు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్లో వస్తున్న కథ ఇది. గోదావరి భాషలో చెప్పాలంటే ఇది మంచి పులస లాంటి సినిమా. ఇప్పుడు సీజన్ కూడా పులస సీజనే..అదే సీజన్లో ఈ సినిమా వస్తోంది. నేను రొటీన్ సినిమాలు చేయను, డిఫరెంట్‌గా ఉండే కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని చేస్తానని, ఎందుకు చెప్పానో ఈ నెల 27 తర్వాత మీకు తెలుస్తుంది' అని తెలిపారు.