Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి 'భోళా శంకర్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను అగ్ర కథానాయకుడు మహేష్ బాబు విడుదల చేశారు. 'హ్యాపీ బర్త్ డే చిరంజీవిగారు. నా స్నేహితుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో, నా ఫేవరేట్ ప్రొడ్యూసర్ అనీల్ సుంకర్ నిర్మాతగా రూపొందనున్న మీ 'భోళా శంకర్' సినిమా టైటిల్‌ను నేను విడుదల చేయటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ ఏడాది మీరు ఆయురారోగ్యాలతో విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సర్' అంటూ ట్వీట్లో మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అన్నా చెల్లెళ్ళ అనుబంధమే మెయిన్ హైలెట్. రక్షా బంధన్ సందర్భంగా చిరంజీవికి కీర్తి సురేష్ రాఖీ కట్టి, 'చెల్లెలందరీ రక్షాబంధం, అభిమానులందరి ఆత్మ బంధం, మన అందరి అన్నయ్య జన్మదినం, హ్యాపీ బర్త్ డే అన్నయ్య..' అంటూ ఆయనకు పుట్టినరోజు అభినందనలు తెలిపారు.
'రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజున మెగాస్టార్ చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడం ఆనందంగా ఉంది. మీతో కలిసి నటించడమనేది నా కల. ఈ అద్భుతమైన ప్రయాణం ఎప్పుడు ఎదురువుతుందా! అని ఎదురు చూడలేక పోతున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య' అంటూ కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ కమర్షియల్స్ అసోషియేషన్‌తో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.