Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేక్షకుల విశేష ఆదరణతో 'తరగతి గది దాటి' వెబ్ సిరీస్ మంచి సక్సెస్‌ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని అంటున్నారు మేకర్స్. 'ఆహా' ఓటీటీ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్ విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫోరం సుజనా మాల్లో మేకర్స్ సక్సెస్‌మీట్‌ని ఘనంగా నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ వేడుకలో హీరో హర్షిత్ రెడ్డి, హీరోయిన్ పాయల్ రాధాకష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో కిిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, 'త్వరలోనే మా ' ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమా కూడా 'ఆహా'లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా, వెబ్ సిరీస్.. టాక్ షో.. ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, 'ఆహా' మంచి వినోదాన్ని అందిస్తూ, విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇందులో భాగంగా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న 'తరగతి గది దాటి' వెబ్‌సిరీస్ అందర్నీ సూపర్‌గా అలరిస్తోంది. హీరో, హీరోయిన్లు బాగా చేశారు. ఈ వెబ్ సిరీస్ మేకర్స్‌కి మంచి విజయం లభించడం ఆనందంగా ఉంది' అని చెప్పారు.