Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గణేష్ బెల్లంకొండ హీరోగా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. ఎస్.వి2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా సతీశ్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దర్శకుడు తేజ శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోమవారం పూజతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచాన్ చేశారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ చేయబోతున్నారు. న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి దర్శకుడు రాకేష్ స్కీన్ ప్లే రాయగా, రచయిత కష్ణ చైతన్య కథ, మాటలు, పాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: అనిత్, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగల, ఫైట్స్: రామకష్ణ.