Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలనటుడిగా, హీరోగా ప్రేక్షకులను అలరించిన విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం 'అల్లంత దూరాన'. నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక. చలపతి పువ్వల దర్శకుడు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహన రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి మేకర్స్‌కు మంచి పేరు రావాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. అలాగే ఈ చిత్ర మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉందని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చితబందాన్ని అభినందించారు.
'ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని దర్శకుడు చలపతి పువ్వల చెప్పారు. నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, 'హైదరాబాద్‌తో పాటు కార్వేటినగరం, పుత్తూరు, తిరుపతి, ఆర్.కె.వి.పేట, కేరళ, చెన్నై, పాండిచ్చేరి తదితర లొకేషన్లలో జరిపిన చిత్రీకరణతో సినిమా పూర్తయ్యింది. తెలుగుతో పాటు ప్రముఖ తమిళ నటీనటులు కూడా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది' అని అన్నారు. హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ, 'చలపతి పువ్వల దర్శకత్వంలోనే రూపొందిన 'కళాపోషకులు' చిత్రంలోనూ నటించాను. మంచి విజన్ ఉన్న దర్శకుడు. అభిరుచి కలిగిన నిర్మాతతో మంచి మెలో డ్రామా చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉంది' అని చెప్పారు.