Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం 'ఫ్రెండ్ షిప్'. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దాదాపు పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆద్యంతం వైవిధ్యంగా ఉంటుంది. మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో సూపర్ హిట్ అయిన 'క్వీన్' సినిమాని 'ఫ్రెండ్షిప్' పేరుతో రీమేక్ చేశారు. హర్భజన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. రాజకీయ నాయకులకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్‌గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య తెరకెక్కించారు. ఇందులో ఉన్న ఐదు ఫైట్స్, నాలుగు పాటలూ అందర్నీ విశేషంగా అలరిస్తాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా సెన్సార్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్‌లో విడుదలకు ప్లాన్ చేశాం' అని తెలిపారు.