Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్ చదలవాడ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇషాన్ సూర్య దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'సీరియస్‌గా చూస్తున్న పహిల్వాన్లు, వారి మధ్యలో కూల్‌గా, స్టైల్‌గా కొబ్బరి బొండం తాగుతూ కూర్చున్న హీరో లక్ష్ లుక్‌కి సర్వత్రా మంచి అప్రిషియేషన్ లభించింది. లక్ష్ తన పాత్ర కోసం బాగా మేకోవర్ అయ్యారని ఈ లుక్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. డిఫరెంట్ లుక్‌తో, సరికొత్త డైమన్షన్‌లో ఉండే క్యారెక్టర్‌తో లక్ష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి కూడా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తొలి సాంగ్‌ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.