Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా' తొలిసారి చిన్నారుల కోసం 'మహా గణేశ' పేరుతో యానిమేటెడ్ ఒరిజినల్‌ను రూపొందించింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఇది ప్రసారం కానుంది. ఆహా, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రై.లి కలయికలో రాజీవ్ చిలక దీన్ని తెరకెక్కించారు. 'మహా గణేశ' తొలి పోస్టర్, సాంగ్‌ను మంగళవారం రాజీవ్ చిలక, అజిత్ ఠాకూర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆహా సి.ఇ.ఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ 'కొత్త తరంలోని పిల్లలకు మన కథలు, విలువలు ద్వారా మన మూలాల ప్రాధాన్యతను 'ఆహా కిడ్స్' ద్వారా వివరిస్తున్నాం' అని చెప్పారు. 'మన దేవతల్లో ప్రథమ పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి సంబంధించిన వినాయక చవితి పురాణాన్ని 'మహా గణేశ' తెలియజేస్తుంది' అని రాజీవ్ చిలక తెలిపారు.