Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మమ్ముట్టి కథానాయకుడిగా మలయాళంలో అఖండ విజయం సాధించిన చిత్రం 'మాస్టర్ పీస్'. శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో, శ్రీ ఎల్.వి.ఆర్ సంస్థ ద్వారా లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని 'గ్రేట్ శంకర్'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, 'మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ఎన్నో చిత్రాలు తెలుగునాట విడుదలై, మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. అలాగే తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానం, ఇమేజ్ ఏర్పడింది. ఆయన మలయాళంలో నటించిన 'మాస్టర్ పీస్' విశేష ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించింది. ఇందులో ఆయన నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. అలాగే 'క్రాక్', 'నాంది' వంటి భిన్న చిత్రాల్లో నటించి, మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ ఏసీపీ పాత్రలో నటించారు. మంచి కథాబలంతో, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా అద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా తెలుగునాట కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు. ఉన్ని ముకుందన్ (భాగమతి ఫేం), పూనమ్ బజ్వా తదితరులు నటించిన ఈ చిత్రానికి స్టోరీ :ఉదయ కష్ణ, మ్యూజిక్ : దీపక్ దేవ్, డిఓపి : వినోద్ వల్లంపాటి, దర్శకత్వం: అజరు వాసుదేవ్.