Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రౌడీ బార్సు'. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దీనికి శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేయగా, మోషన్ పోస్టర్‌ను డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, 'మా ఫ్యామిలీలో ఆశిష్ హీరో అవుతాడని అనుకోలేదు. ఈ సినిమాతో తనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రజెంట్ యూత్ ఎలాంటి సినిమాని కోరుకుంటున్నారో, అలాంటి సినిమా ఇది. సినిమా దాదాపు పూర్తయ్యింది. అక్టోబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం' అని చెప్పారు. హీరో ఆశిష్ మాట్లాడుతూ, 'మా ఫ్యామిలీలో నేను హీరో కావాలని అనుకున్న మొదటి వ్యక్తి మా అనిత అంటీ.. కానీ ఆమె ఈరోజు ఇక్కడ లేరు. ఆమెను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం నా బాధ్యత. డైరెక్టర్ హర్ష నాతో మంచి సినిమా చేశాడు' అని చెప్పారు. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ, 'కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో, మనలో తెలియని ఓ ఎనర్జీ ఉంటుంది. దీంతో మనకు తెలియకుండానే రచ్చ చేస్తాం. ఈ సినిమాలోనూ అంతే మా బార్సు చాలా రౌడీ పనులతో రచ్చ చేస్తారు. దాని వల్ల ఏం జరిగిందనేదే సినిమా' అని అన్నారు.