Authorization
Mon Jan 19, 2015 06:51 pm
70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై 'భలే మంచి రోజు', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' వంటి భిన్న చిత్రాలతో అభిరుచిగల నిర్మాతలుగా విజరు చిల్లా, శశి దేవిరెడ్డి మంచి గుర్తింపు పొందారు. తాజాగా 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా మంగళవారం నిర్మాతలు విజరు చిల్లా, శశి దేవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ,'మా సినిమా షూటింగ్ అయిపోయే లోపు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ బిజినెస్ పూర్తయ్యింది. మొదట ఈ సినిమాకి 'నల్ల వంతెన' అని టైటిల్ అనుకున్నాం. కానీ మా లవ్ స్టోరీకి ఈ టైటిల్ క్యాచీగా లేదని 'శ్రీదేవి సోడా సెంటర్' టైటిల్‌ను ఫిక్స్ చేశాం. మా దర్శకుడు తీసిన 'పలాస' చాలా రా..గా ఉన్నా ఈ సినిమా రియల్‌గా ఉంటుంది. అయితే ఈ సినిమా రా..గా ఉండదు. కానీ ఈ సినిమాలో రియల్ క్యారెక్టర్స్ ఉంటాయి. పూర్తి రూరల్ బ్యాక్ డ్రాప్లో ఉన్న ఈ సినిమాకి మణిశర్మగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న బిగ్గెస్ట్ థియేటర్ రిలీజ్ మూవీ మాదే. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ లక్ష్మణ్ గారి సపోర్ట్‌తో ఆంధ్ర, తెలంగాణలో సుమారు 500 థియేటర్స్‌లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. అలాగే అమెరికాలో 120 థియేటర్స్‌లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా భారీ రిలీజ్‌కి రెడీ అయ్యాం. ఫ్యామిలీస్ కావచ్చు, ఇంకెవరైనా కూడా 20 మంది కలిసి టికెట్స్ బుక్ చేసుకుంటే షో వేస్తాం. యూఎస్‌లో ఇలాంటి కొత్త కల్చర్‌ను అలవాటు చేస్తున్నాం. సెన్సార్ వాళ్ళు ఒక కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రస్తుతం మేం మంచి కథల కోసం చూస్తున్నాం. ఇప్పుడు ఒక స్క్రిప్టు రెడీ అవుతోంది. వైయస్ జగన్ గారి బయోపిక్ కథ మాకు ఎవరూ చెప్పలేదు. ఏం డైరెక్టర్ కూడా చేస్తామని ఆఫీసియల్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు' అని తెలిపారు.