Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ తొలి చిత్రంగా నిర్మించిన చిత్రం 'హౌస్ అరెస్ట్'. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, రవిప్రకాశ్, రవిబాబు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ, రామ్ ప్రసాద్, చంద్రమహేశ్, అశోక్ రెడ్డి, ఎన్.శంకర్, చందు రెడ్డి తదితరులు పాల్గొని బిగ్ టిక్కెట్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఎర్రా మాట్లాడుతూ, 'ఈ జనరేషన్లో పిల్లలు ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏదైన సమస్య వచ్చినప్పుడు వారెలా రియాక్ట్ అవుతున్నారనే విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. తెలుగులో పిల్లల సినిమాలు వచ్చి 15 ఏళ్ళు అవుతోంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మంచి పిల్లల సినిమా ఇది' అని తెలిపారు.