Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 70 ఎం.ఎం. ఎంటర్టైన్మైంట్స్ పతాకంపై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఒక బర్నింగ్ ఇష్యుని సినిమాటిక్ ఫార్మెట్‌తో 'పలాస' చేశాను. ఈ సినిమాలో కూడా బలమైన సమస్యనే చర్చించాం. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కమ్యూనిటీస్ వాళ్ల మధ్య ఉండే భావోద్వేగాల మధ్య కథ నడుస్తుంటే, ఆ కథలో భాగంగా ఓ ప్రేమ కథ ఉంటుంది. అలాగే తూర్పు గోదావరి వారిలో కూడా అన్ని రకాలైన ఎమోషన్స్, భావోద్వేగాలు, వివక్ష, రాజకీయాలు, ఘోరమైన ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయని ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. మేం అనుకున్న లోకేషన్స్‌లో శ్యామ్ దత్ సినిమాను చాలా అందంగా తెరకెక్కించాడు. ఒక సోడా సెంటర్ యజమాని కూతురు హీరోయిన్. అల్లరి చిల్లరిగా కనిపించే తెలివైన ఓ సాధారణ ఎలక్ట్రీషియన్ హీరో. వీరి మధ్య చిగురించిన ప్రేమే ఈ సినిమా. ప్రేమ తాలూకు పర్యవసానాలు, దాని వెనుక ఉండే సాంఘిక, సామాజిక, ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య వాళ్ళు ఏమయ్యారనేది మాటల్లో కంటే వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమా తర్వాత కొత్త మణిశర్మగారిని చూస్తారు. ఆయన ఈ సినిమాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. నా భావాలకు అనుగుణంగా సినిమాని స్వేచ్ఛగా తెరకెక్కించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. సుధీర్ బాబు చాలా డెడికేటెడ్ యాక్టర్. ప్రతి సినిమాకి వైవిధ్యంతో కొత్త ప్రయత్నం చేయడానికి తపిస్తాడు. 'పలాస' సినిమా చూసి, సినిమా బాగుందని నన్ను అప్రిషియేట్ చేసి, నాతో సినిమా ఈ సినిమా చేశారు. నేను రాసుకున్న కథలన్నీ కూడా కథే హీరో. నన్ను, నా కథను నమ్మిన వారితోనే సినిమాలు చేస్తాను' అని అన్నారు.