Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో సందీప్ కిషన్ నిర్మించి, నటించిన చిత్రం 'వివాహ భోజనంబు'. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కమెడియన్ సత్య హీరోగా, ఆర్జావీ రాజ్ నాయికగా నటించారు. ఈ నెల 27న ఈ సినిమా 'సోని లివ్' ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ, ''సోని లివ్' కు నార్త్‌లో బాగా ఆదరణ ఉంది. వాళ్లు తెలుగులో మా చిత్రంతో అడుగుపెడుతుండటం సంతోషంగా ఉంది. అతి తక్కువ టైమ్‌లోనే సోని లివ్కు మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నాను. దర్శకుడు రామ్ అబ్బరాజు రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నాడు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చూసేందుకు నేను పర్సనల్‌గా బాగా ఇష్టపడతాను. అయితే ఇది ఒక కమెడియన్ ఇమేజ్ ఉన్న నటుడు చేస్తేనే బాగుంటుంది. అందుకే సత్యను ఎంచుకున్నాం. సత్య అద్భుతంగా నటించాడు. దీంట్లో ఎలాగైనా నటించాలని నెల్లూరు ప్రభ పాత్రను పోషించాను. లాక్ డౌన్లో ఇల్లీగల్‌గా ప్రయాణికులను తీసుకు వెళ్ళే పాత్ర నాది. నెల్లూరు యాసలో మాట్లాడటం ఆస్వాదించాను. త్వరలో 'గల్లీరౌడీ' సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా, 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో ఓ క్యారెక్టర్ చేస్తున్నా' అని చెప్పారు.