Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెన్నెల, రీతూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'కాలం రాసిన కథలు'. బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో ఎస్ ఎమ్ 4 ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.ఎన్. వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా జరిగింది. వెన్నెల, రీతూపై చిత్రీకరించిన తొలి షాట్‌కు హాస్య నటుడు పృథ్వీరాజ్ క్లాప్ ఇవ్వగా, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజరు కుమార్ స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత సాగర్ మాట్లాడుతూ, 'నా స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన 'కొంటె కుర్రాడు అలియాస్ లోఫర్ గాడి ప్రేమ కథ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా కొత్త చిత్రాన్ని ప్రారంభించాను. ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని ధైర్యం కుటుంబం మాత్రమే ఇవ్వగలదనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఈ చిత్రంలో వెన్నెల, రీతూ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు మరికొంత మంది ఆర్టిస్టులను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది' అని తెలిపారు. ఈ చిత్రానికి డిఓపి: దేవి వరప్రసాద్, ఎడిటర్: మేకల మహేష్, మ్యూజిక్: మెరుగు అరమాన్, లిరిక్స్: శ్రీనివాస్ తమ్మిశెట్టి, కొరియా గ్రఫీ: వి నైన్ విజరు మాస్టర్, నిర్మాత- రైటర్- డైరెక్టర్: ఎమ్.ఎన్.వి సాగర్.