Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి జీవితానికి ఆది, అంతం... చావు పుట్టుకలే. ఈ రెండింటి ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రకృతి నేపథ్యంగా రూపొందిన చిత్రం 'బిగినింగ్'. ముదునూరు రాజ్ దర్శకుడు.
చేతన్ శర్మ, ప్రమోద్ కుమార్, ఆయుషి రావత్, ఆర్యన్ ప్రీత్ వంటి నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని జోషిరామ్, సష్టి జైన్ నిర్మిస్తున్నారు. డిఎన్ఏ ప్రొడక్షన్స్ నిర్మాణంలో హర్షితా ఎంటర్టైన్ మెంట్స్, గుడివాడ స్టూడియోస్ భాగస్వామ్య నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదలైంది.
సరికొత్త కంటెంట్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ని దక్కించుకోవడంతోపాటు ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'కొన్నేళ్ల క్రితం '3జి లవ్' టైటిల్‌తో థర్డ్ జనరేషన్ సినిమా చేసిన దర్శకుడు ముదునూరు రాజ్ ఈసారి పరిపక్వత కలిగిన 'బిగినింగ్' స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. జర్మనీలో స్థిరపడిన కవిశంకర్ సంగీతం సమకూర్చిన చిత్రానికి ఢిల్లీ బేస్డ్ కెమెరామెన్ నౌషద్ అలీ పనితనం మా చిత్రానికి హైలెట్ అవుతుంది. త్వరలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా చిత్రంలోని పాటలు విడుదల కానున్నాయి. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు. దర్శకుడు ముదునూరు రాజ్ మాట్లాడుతూ, 'ఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన కథ చెప్పడం కోసం, హిమాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని నేచర్‌కి దగ్గరగా వెళ్లాం. మేం చూపించే నేచర్‌తో టాలీవుడ్‌కు సరికొత్త లొకేషన్లను పరిచయం చేయబోతున్నాం. కథలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యం ఉంది. వాటిపై ఆసక్తి పెంచేందుకే, టైలర్లో పాత్రలను చూపించకుండా సీక్రసీ మెయిన్టైన్ చేశాం. సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది. త్వరలోనే రిలీజ్ చేస్తాం' అని చెప్పారు.