Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'డియర్ మేఘ'. సుశాంత్ రెడ్డి దర్శకుడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, 'ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించడంతోపాటు ప్రేమికుల తాలూకా ఫీలింగ్స్‌ని ఇంటివరకు క్యారీ చేసేలా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ తరహా హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ రాలేదు. ఓ మంచి ప్రేమకథని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ పూర్తయ్యింది. సెప్టెంబర్ 3న దాదాపు 300 థియేటర్లలో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.