Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వందన మూవీస్ పతాకంపై నిర్మాత టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం 'సీతామనోహర శ్రీరాఘవ'. ఈ చిత్రంతో అలనాటి హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు విరాట్ రాజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దుర్గా శ్రీ వత్సస.కె. దర్శకుడు. సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. హీరో విరాట్ రాజ్ పుట్టినరోజు నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను, వీడియోను సత్యానంద్ విడుదల చేసి, ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా హీరో విరాట్రాజ్ మాట్లాడుతూ, 'తాత వెంకట సుబ్బరాజు 'భక్త తుకారాం', 'కోడె నాగు', 'రిక్షా రాజి' వంటి అలనాటి చిత్రాల్లో నటించారు. ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్గారి స్ఫూర్తితో ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్ ప్రారంభానికి సరైన చిత్రంగా భావిస్తున్నాను' అని చెప్పారు.
'ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. మా సినిమా టైటిల్ 'సీతామనోహర శ్రీరాఘవ'. టైటిల్ వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. పలు భావోద్వేగాల సమాహారంగా ప్రేక్షకులను అలరిస్తుంది' అని దర్శకుడు దుర్గా శ్రీ వత్సస.కె. అన్నారు.
నిర్మాత టి.సుధాకర్ మాట్లాడుతూ, 'వెండితెరకు మరో నట వారసుడు విరాట్రాజ్ను మా సంస్థ ద్వారా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభిస్తాం. 'కె.జి.ఎఫ్. 2', 'సలార్ ' చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న రవి బస్ రుర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు' అని తెలిపారు.