Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో వరుణ్ తేజ్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌ను అభినందించారు.
'పెళ్లి చేసుకోవాల్సిన వయసులోని యువకుడికి బట్టతల వచ్చినప్పుడు, అతనెలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు?, తన సమస్యను దాచి పెట్టడానికి, తన ప్రేయసి దగ్గర తనకు బట్టతల ఉందనే నిజం తెలియనీయకుండా అతను పడే ఇబ్బందులతో పాటు ఓ ఎమోషనల్ కోణంలో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. అలాగే ఈ సినిమాలో కావాల్సినంత కామెడీ, ఎమోషన్స్ ఉన్నాయనేది కూడా అర్థమవుతోంది. టాలీవుడ్లో నటుడిగా,సెన్సిబుల్ డైరెక్టర్‌గా, రైటర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులు ఎంజారు చేసేలా, మంచి ఎంటర్టైనింగ్ కథను అందించడం విశేషం. రామ్ సినిమాటోగ్రఫీ, శక్తికాంత్ కార్తీక్ సంగీతం ఈ చిత్రానికి మరిన్ని అదనపు ఆకర్షణలు. సెప్టెంబర్ 3న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది' అని చిత్ర యూనిట్ పేర్కొంది.