Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయకుడు వినరు పనిగ్రహి నటిస్తున్న చిత్రం 'ధ్వని'. పరమ కష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ పతాకంపై పరమ కష్ణ సాన సమర్పణలో సాధన నన్నపనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ దుర్గారావు సాన దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో నవదీప్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'డైరెక్టర్ దుర్గ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు. ఆయనలో మంచి పట్టుదల ఉంది. ఓ వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది' అని చెప్పారు.
'సౌండ్‌కి సంబంధించిన వ్యాధితో బాధపడే ఓ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి?, ఆ సంఘటనల నుండి ఎలా బయటపడ్డాడు?, అనేది ఈ సినిమా కాన్సెప్ట్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని తన పాత్ర కోసం హీరో వినరు ట్రాన్స్ఫర్మేషన్ బాగా అయ్యారని ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతోంది. అలాగే తన లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అన్నింటికిమించి కథానాయకుడి పాత్ర సరికొత్త డైమన్షన్‌లో ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రతిక్ అబ్యాంకర్, ఆనంద్ నంబియర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంఆర్.రాజకీష్ణన్ సౌండ్ మిక్సింగ్ చేస్తున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.
వినరు పనిగ్రహి, స్వాతి మండది, త్రినాధ్ వర్మ, రవీందర్ రెడ్డి, భావన సాగి, సురేష్, కుమార్, దేవ్, సాయి తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.