Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'కోవిడ్ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో డైరెక్ట్‌గా విడుదల చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. 'పండగకి మన కుటుంబతో... మీ 'టక్ జగదీష్' అంటూ ఓ చిన్న డైలాగ్ వీడియోను నాని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రేక్షకులతో షేర్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్‌లో నాని ''భూదేవీపురం చిన్న కొడుకు, నాయుగారబ్బాయి టక్ జదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి'' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నిర్మాతలు ఈ చిత్రాన్ని పండగ సందర్భంలోనే విడుదల చేయాలని ముందు నుంచీ అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్లే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి అదిరిపోయే ఆల్బమ్‌ను అందించారు. రీతూ వర్మ హీరోయిన్గా, ఐశ్వర్యా రాజేశ్ కీలక పాత్రలో నటించింది. నాని అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు' అని తెలిపింది.