Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల ఇండియన్ ఐడల్‌లో విజేతగా నిలిచిన పవన్‌దీప్ రాజన్, తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులు హైదరాబాద్‌లో తొలిసారిగా ఓ లైవ్ కాన్సర్ట్‌తో అలరించేందుకు రెడీ అవు తున్నారు. రివైవ్ కాన్సర్ట్ సిరీస్ పేరుతో ఈ ప్రత్యక్ష సంగీత కార్యక్రమాన్ని 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు నిర్వహించబోతున్నాయి. కోవిడ్ కారణంగా దాదాపు 18 నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుండటం విశేషం. బ్యాండ్, సింగర్, మ్యుజీషియన్లతో కలిసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ప్రతి వారం ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నారు. ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఇండియన్ ఐడల్ విజేత పవణ్‌దీప్ రాజన్, మొదటి రన్నరప్ అరుణిత కంజిలాల్, రెండవ రన్నరప్ సైలి, మూడవ రన్నరప్ మొహమ్మద్ డానిష్, రాక్‌స్టార్ షణ్ముఖ ప్రియ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ, 'ప్రతిభావంతులైన కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసే వేదిక ఇది. తైక్కుడం బ్రిడ్జ్ కళాకారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న, ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌తో సెప్టెంబరు 3న హార్ట్‌కప్‌లో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం. ఈ సిరీస్‌లో దేశంలోని అత్యుత్తమమైన సంగీతకారులతో పాటు గాయకులూ సంగీతాభిమానులను ఉర్రూతలుగించనున్నారు' అని చెప్పారు.