Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''డియర్ మేఘ' సినిమాలో అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు. ఇందులో ఉన్న జెన్యూన్ లవ్‌ను ప్రేక్షకులు కచ్చితంగా ఫీల్ అవుతారు' అని అంటోంది నాయిక మేఘా ఆకాష్. అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా, మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించిన చిత్రం 'డియర్ మేఘ'. వేేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాతో సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మేఘా ఆకాష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు సుశాంత్ రెడ్డి చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్. అయితే ఫీమేల్ సెంట్రిక్ అంటే చాలా ఒత్తిడి ఉంటుందనే భయమూ కలిగింది. కానీ ఇప్పుడు నేనున్న పొజిషన్‌కు తప్పకుండా రిస్క్ చేయాలి. అందుకే కొత్త పాత్రలు, భిన్న స్క్రిప్ట్‌లకు ప్రయారిటీ ఇస్తున్నా. అందులో భాగంగానే ఈ సినిమాకి గ్రీన్‌సిగల్ ఇచ్చా. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. ఇలాంటి కంప్లీట్ రొమాంటిక్ ఫిల్మ్‌లో నేను ఇప్పటివరకూ నటించలేదు. మేఘ క్యారెక్టర్‌కి, నాకూ వ్యక్తిగతంగా కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలన్నీ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. వీటిల్లో 'ఆమని ఉంటే పక్కన..' అనే పాట నా ఫేవరేట్ సాంగ్. నిర్మాత అర్జున్ దాస్యన్ చాలా ఫ్రీడమ్ ఇచ్చి, కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నారు. మొదట్లో నేను నా కంఫర్ట్ జోన్లో ఉండే క్యారెక్టర్స్, సినిమాల్లో నటించాను. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం మారిపోయింది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నాను. ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి' అని అన్నారు.