Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో హీరో శీవిష్ణు మాట్లాడుతూ, 'ప్రతి పాత్ర అదిరిపోయేలా క్రియేట్ చేసిన దర్శకుడు హసిత్ గ్రేట్. ఈ కథ ఇంత బాగా రావడానికి వివేక్ ఆత్రేయ ఓ మెంటర్‌లాగా ఉండి నడిపించాడు. చాలా రోజులు ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది' అని చెప్పారు. 'సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్' అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు.
సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ 'తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఆదరిస్తారని మరోసారి మా సినిమాతో ప్రూవ్ అయ్యింది' అని తెలిపారు. 'ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. మరిన్ని స్క్రీన్స్ పెరగటానికి సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌కు థ్యాంక్స్' అని దర్శకుడు హసిత్ గోలి అన్నారు.