Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
'ఈ సినిమాని ప్రకటించిన రోజు దగ్గర్నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. మేకర్స్ విడుదల చేసిన కంటెంట్‌కు అటు సోషల్ మీడియాలో, ఇటు అభిమానుల్లోనూ అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. అదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు' అని చిత్ర బృందం తెలిపింది.