Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు, ఆనంది జంటగా, కరుణ కుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శిత మవుతూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్బంగా శనివారం చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో నిర్మాతలు మాట్లాడుతూ, 'ఈ సినిమా రివ్యూస్ చూసి మహేష్, రానా, ప్రశాంత్ నీల్ వంటి సినీ ప్రముఖులు సినిమా బాగుందని ట్వీట్ చేస్తున్నారు. విడుదలైన అన్ని థియేటర్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రోజు నుంచే మరిన్ని థియేటర్స్ పెంచుతున్నాం. ఇంతమంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని తెలిపారు. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ,'చాలా పాజిటివ్ కాల్స్ వచ్చాయి. మేము ఎంత గొప్ప సినిమా తీసిన ప్రేక్షకులకు నచ్చక పోతే చూడరు' అని అన్నారు. 'ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి సూరిబాబు, శ్రీదేవి పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. మహేష్ బాబు అనే వ్యక్తిని బెదిరించినా లేకపోతే 200 కోట్లు ఇచ్చినా కూడా తన కెరియర్లో తను నమ్మందే ఏదీ చెయ్యడు. ఈ సినిమా బాగుందని పోస్ట్ చేసిన ట్వీట్లో ఎవరెవరు ఎం చేశారు అనేది క్లియర్‌గా చెప్పాడు. నచ్చితే పది మందికి చెప్పండి. ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన చిత్రం' అని హీరో సుధీర్‌బాబు చెప్పారు.