Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిత్ అరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ''డియర్ మేఘ'. మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్
దాస్యన్ నిర్మించారు. నూతన దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో ఆదిత్ అరుణ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, '2009లో కెరియర్ స్టార్ట్ చేసిన నేను గత 12 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'గరుడ వేగ', '24 కిస్సెస్', 'చీకటి గదిలో చితక్కొట్టుడు' నాకు కమర్షియల్‌గా మంచి హిట్లు ఇచ్చాయి. '24 కిస్సెస్' ఐదు లాంగ్వేజ్‌లో అనువాదమై నాకెంతో మంచి పేరు తీసుకొచ్చింది. 'చీకటి గదిలో..' సినిమా ద్వారా అడల్ట్ కంటెంట్ ఆడియన్స్‌కు మాత్రమే
నేను కనెక్ట్ అయ్యాని అన్నారు. నేనొక నటుడుని మాత్రమే ఏ కథ, ఏ పాత్ర వచ్చినా చేస్తాను. అయితే 'డియర్ మేఘ'తో నాకున్న ట్యాగ్ పోతుందని భావిస్తున్నా. ఈ కథ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లవ్ స్టోరీస్‌ని గ్రాండ్‌గా చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు ఫీలయ్యేలా చూపిస్తే చాలు. ఈ విషయంలో దర్శకుడు సుశాంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా నా కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలో కంటే ఇది చాలా పాజిటివ్ సినిమా. ప్రస్తుతం 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ', 'కథ కంచికి మనం ఇంటికి' తోపాటు మరో నాలుగైదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి' అని చెప్పారు.