Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ ముఖ్య పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'స్ట్రీట్ లైట్'. మూవీ మాక్స్ బ్యానర్ పై విశ్వ దర్శకత్వంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, 'క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా కూడా. పగలంతా పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్స్ ఎలా మారతాయనే నేపథ్యంలో ఈ సినిమా తీసాం. చీకట్లో ముఖ్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్‌ని ఎంజారు చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు?, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం వంటి రివేంజ్ డ్రామాను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా తీర్చి దిద్దాం. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను దర్శకుడు విశ్వ ప్రసాద్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. గతంలో మేం విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్‌తో పాటు టీజర్‌ను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం. మూడవ వారంలో మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నాం. సినిమా బాగా వచ్చింది' అని చెప్పారు.