Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 3న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకని చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, 'ఈ స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు ఇది నా ఆలోచన అనుకుంటే, స్క్రిప్ట్ డెవలప్మెంట్లో అందరి కథగా మారింది. ఈ జర్నీని చాలా ఎంజారు చేశాను. శక్తికాంత్ కార్తీక్ కథ వినగానే కనెక్ట్ అయిపోయి, అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది' అని చెప్పారు.
''కంచె' సినిమా చేస్తున్న సమయంలో ప్రతి మనిషిలోనూ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. వాటి వల్ల వాళ్లే వారి జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటారు. ఆ పాయింట్‌ను హిలేరియస్‌గా చూపిస్తానంటూ ఇరవై నిమిషాల కథను అవసరాల నాకు చెప్పారు. బాగా నవ్వుకున్నాం. నాకు, రాజీవ్‌గారికి కథ బాగా నచ్చింది. ఈ సినిమా కోసం ఐదారు నెలల పాటు అవసరాల గుండుతోనే ఉన్నారు. చాలా మంచి ఎంటర్టైనర్గానే కాదు, చాలా మంచి మీనింగ్ ఉన్న సినిమా ఇది. అవసరాల అందరినీ నవ్విస్తాడు. ఈ సినిమాతో నవరసాల శ్రీనివాస్‌గా అవసరాల శ్రీనివాస్ పేరు తెచ్చుకుంటాడు' అని క్రిష్ తెలిపారు.డైరెక్టర్ రాచకొండ విద్యాసాగర్ మాట్లాడుతూ,'శ్రీని అద్భుతమైన కథను రాశారు. ఇది నా కథ కూడా. ఈ కథ ఎంతో మందిని కదిలిస్తుంది. సినిమా చూసిన ప్రతిసారి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అంత గొప్ప ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయి. ఎవరి జీవితాన్నో మనం దగ్గర నుంచి చూస్తున్నట్లు అనిపిస్తుంది' అని చెప్పారు.