Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం 'లాభం'. ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ అధినేత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
లాయర్ శ్రీరామ్ సమర్పకుడిగా, హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వినాయకచవితి పండుగ సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'మా 'లాభం' చిత్రాన్ని వినాయక చవితి పండుగ స్పెషల్‌గా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేస్తున్నాం. ఇలా ఏకకాలంలో రెండు భాషల్లో విజరు సేతుపతి చిత్రం విడుదల కావడం తొలిసారి కావడం విశేషం. 'మాస్టర్', 'ఉప్పెన' తర్వాత విజరు సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. ప్రేక్షకులను మెప్పించే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నాయి. తెలుగునాట ఓ మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న విజరు సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది' అని తెలిపారు.