Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున 'బంగార్రాజు'గా, 'ఘోస్ట్'గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆదివారం నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన అప్డేట్లను సదరు చిత్ర బృందాలు ప్రకటించాయి. దీంతో ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీస్టారర్ 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కల్యాణ్ కష్ణ కురసాల దర్శకుడు. ఈ చిత్రం నుండి నాగ్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'బంగార్రాజు'..ది డెవిల్ ఈజ్ బ్యాక్ అని పోస్టర్లో క్యాప్షనూ ఇచ్చారు. ఈ చిత్రంలోనూ నాగ్ సరసన రమ్యకష్ణ నటిస్తున్నారు. నాగచైతన్య సరసన కృతిశెట్టి మెరవనుంది.
నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి 'ది ఘోస్ట్' అనే టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. నాగ్ బర్త్‌డే కానుకగా చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. 'మీరు అతన్ని చంపలేరు. మీరు అతన్నుంచి తప్పించుకోలేరు. మీరు అతనితో చర్చలు జరపలేరు. కేవలం దయ కోసం మాత్రమే ఆయన్ని వేడుకోవచ్చు.. అంటూ నో మెర్సీ అనే క్యాప్షన్‌ని మోషన్ పోస్టర్లో జోడించారు. కాజల్ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.