Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ శంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ద్వారా రామరాజు.జి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది.
ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు మారుతి దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి షాట్‌కు క్లాప్ ఇచ్చారు.
'మా చిత్ర కథను తెలుసుకుని, స్టోరీ చాలా క్రియేటివ్‌గా ఉందంటూ టీమ్‌ని దర్శకుడు మారుతి అభినందించడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేస్తాం' అని దర్శకుడు రామరాజు చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మురళీధర్ సింగు, సంగీతం : మహవీర్ యెలందర్, లిరిక్స్ : పూడి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వీరబాబు.కె, ప్రొడ్యూసర్ : జి. రాధిక.