Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'శ్రీదేవి సోడా సెంటర్' గురించి మహేష్‌బాబు
సుధీర్ బాబు, ఆనంది జంటగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైంది. విశేష ప్రేక్షకాదరణతో ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. సినిమా విడుదలైన రోజే అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు ఈ సినిమాని చూసి, చిత్ర బృందాన్ని అభినందించారు. తాజాగా 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్లో ఉన్న మహేష్‌బాబును హీరో సుధీర్ బాబు, నిర్మాతలు, దర్శకుడు ప్రత్యేకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ, ''శ్రీదేవి సోడా సెంటర్'లో సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. తన కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే. మహిళలందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో మహిళా ప్రాధాన్యత సన్నివేశాలు చాలా ఉన్నాయి. హీరోయిన్ ఆనంది నటన అద్భుతంగా ఉంది. బోట్ రేసింగ్ సీన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. శ్యామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మణిశర్మ సంగీతం నెక్ట్స్ లెవల్లో ఉంది. ఈ సినిమాకు ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. ఈ సినిమాను అందరూ చూసినపుడే దర్శకుడు చూపించిన విషయం, చెప్పాలనుకున్న సందేశం ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని చూడాలని కోరుతున్నా. ఇలాంటి అద్భుతమైన సినిమాలు సుధీర్ బాబు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా' అని తెలిపారు.