Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'డియర్ మేఘ'. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం అత్యంత వైభవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ,'ఇదొక అద్భుతమైన రొమాంటిక్ ఫిల్మ్. ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ మధ్యకాలంలో రాలేదు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పను. ఎందుకంటే సినిమా గురించి నా ఫీలింగ్స్ ఆల్రెడీ చెప్పేశా' అని అన్నారు.
హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ,'నా పేరు మీద గతంలో ఓ పాట వచ్చింది. ఇప్పుడు సినిమా రూపొందడం అదష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ సుశాంత్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. మేఘ స్వరూప్ క్యారెక్టర్‌ను నాతో చేయించినందుకు థ్యాంక్యూ. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ' అని తెలిపారు. దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ తెలుగులో ఒక పెద్ద బ్యానర్ అవుతుంది. నెక్ట్ ఆ సంస్థ నుంచి మంచి మంచి చిత్రాలు రాబోతున్నాయి. మా సినిమాలో పాటలు వింటే సినిమా చూసేందుకు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కు వస్తారు. అరుణ్‌తో నా ఫ్రెండ్ షిప్‌కు గిఫ్ట్ 'డియర్ మేఘ'' అని అన్నారు.
'మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీకి, సాంగ్ రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరంకు థ్యాంక్స్. ప్రతి లవ్ స్టోరీ అబ్బాయి కోణంలో ఉంటుంది. కానీ 'డియర్ మేఘ' మాత్రం అమ్మాయి వైపు నుంచి కథ చెబుతుంది. ఈ కథ నచ్చి తెలుగు ప్రేక్షకుల కోసం డెవలప్ చేయించాం. పాటలు వినసొంపుగా, విజువల్స్ గ్రాండ్‌గా ఉంటాయి' అని నిర్మాత అర్జున్ దాస్యన్ తెలిపారు. హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ, 'మనం థియేటర్లో ఫ్యామిలీతో కలిసి ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నామో, అలాంటి సినిమా ఇది. నిర్మాత అర్జున్ దాస్యన్ ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే అంతే ధైర్యంగా సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఆర్జీవీ నాతో సినిమా చేస్తానని ఇప్పటిదాకా చెప్పలేదు. ఈ వేదిక మీదే ఎనౌన్స్ చేశారు. నాకు ఇదో ఎచీవ్మెంట్ అనుకుంటున్నా' అని అన్నారు.