Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్సేన్ హీరోగా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం 'పాగల్'. ఈ సినిమా ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందింది.
ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా సినిమాను విడుదల చేశాం. అప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ అందరికీ బాగా నచ్చాయి. రిలీజైన సినిమాను ప్రేక్షకులు చక్కగా ఆదరించడంతో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా రీచ్ అయ్యాం. ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేశా, నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈనెల 3న మా సినిమా అమెజాన్‌లో విడుదలవుతోంది. శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడైపోయాయి. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా పోలీస్ ఆఫీసర్ బయోపిక్ తరహాలో ఓ సినిమా చేస్తున్నాం. ఇక కూడా భిన్న కథా చిత్రాలకే నా ప్రాధాన్యం. మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాను' అని చెప్పారు.