Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'జీఎస్టీ' ( గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ,'టైటిల్ చాలా బాగుంది. డైరెక్టర్ చెప్పిన సినిమా కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. మంచి సందేశం ఇస్తున్నారు' అని చెప్పారు.
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ, 'ఈ సమాజంలో దేవుడు, దెయ్యం, సైన్స్ పై చాలా అనుమానాలు, అపోహలున్నాయి. వాటిని నిగ్గు తేల్చడానికే మేం దమ్మున్న కథతో ఈ సినిమా తీశాం. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో హర్రర్ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, సైన్స్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ...ఈ మూడింటిని కలిపి అసలు ఏది వాస్తవం?, ఏది అబద్ధం అనే విషయాన్ని మేం చెప్పబోతున్నాం. హర్రర్ సినిమా అంటే ఒక వర్గానికి పరిమితమైన ప్రేక్షకులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా లవ్, సెంటిమెంట్ , కామెడీ, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మా సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ప్రశంసలు పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంటుంది. ఈనెల 10న థియోటర్స్లో మా సినిమాని థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సంపు, కథానాయిక స్వాతి మండల్, అశోక్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.