Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధాకర్ జంగం, లావణ్య హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అం అః'. 'ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్' అనేది ట్యాగ్‌లైన్. శ్యామ్ మండల దర్శకుడు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ''అం అః' మూవీ టైటిల్ చాలా బాగుంది. ఇది వరకు నేను కూడా 'అఆఇఈ' అనే టైటిల్‌తో సినిమా చేశాను. పోస్టర్‌ను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ శ్యామ్ మండల, నిర్మాత శ్రీనివాస్, హీరో సుధాకర్ ఓ టీమ్‌గా ఏర్పడి మంచి కంటెంట్‌తో చేస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి' అని చెప్పారు.
'డైరెక్టర్ శ్యామ్ మండల అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమాని చక్కగా పూర్తి చేశారు. శివ తన సినిమాటోగ్రఫీతో సినిమాని రిచ్‌గా ఎలివేట్ చేశారు' అని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. దర్శకుడు శ్యామ్ మండల మాట్లాడుతూ, 'నిర్మాత శ్రీనివాస్ ఇచ్చిన సపోర్ట్‌తోనే 'ట్రూ' అనే సినిమాని పూర్తి చేశా, ఆ నమ్మకంతోనే ఈ సినిమాని ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. డిఫరెంట్ థ్రిల్లర్. కంటెంట్‌ని నమ్మి హీరో సుధాకర్ ఈ చిత్రంలో నటించారు' అని చెప్పారు. హీరో సుధాకర్ జంగం మాట్లాడుతూ, 'హీరోగా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నిర్మాత శ్రీనివాస్‌కి, డైరెక్టర్ శ్యామ్‌కి థ్యాంక్స్' అని అన్నారు.