Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈనెల 3న విడుదలకు సిద్ధంగా ఉందీ చిత్రం. ఈ సందర్భంగా హీరోయిన్ రుహానీ శర్మ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ''చి.ల.సౌ' సాధించిన సక్సెస్‌తో హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కింది. దీంతో అప్పుడు '101 జిల్లాల అందగాడు', 'హిట్' సినిమాలతో పాటు మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాను. వాటిలో హిట్ విడుదలై హిట్టైంది. ఇప్పుడు '101 జిల్లాల అందగాడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఈనెల 3న విడుదలయ్యే ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. బట్టతల ఉండే ఓ యువకుడు, అలా ఉండటానికి ఇష్టపడడు. అయితే దాని వల్ల అతనెలాంటి పనులు చేశాడు?, చివరకు అతనికి ఏం తెలిసింది?, తనని తాను ఎలా ప్రేమించుకున్నాడనేదే ఈ సినిమా కథ. అవసరాల శ్రీనివాస్, నా పాత్ర చుట్టూనే సినిమా ఎక్కువగా రన్ అవుతుంది. నా పాత్ర ఏంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. హీరో జర్నీలో హీరోయిన్ పాత్ర ఏంటి? ఆమె కోసం హీరో ఎలా మారాడు? అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాకు నా పాత్రే ఆత్మ. ఇలాంటి చిత్రంలో నటించినందుకు సంతృప్తిగా ఉంది. ఇకపై కూడా స్క్రిప్ట్, నా పాత్ర నచ్చితే చాలు.. స్క్రీన్ స్పేస్ గురించి ఆలోచించను. ప్రస్తుతం నాని నిర్మిస్తున్న 'మీట్ క్యూట్'తోపాటు మరో అంథాలజీలో నటిస్తున్నాను. అలాగే హిందీలో ఓ వెబ్ సిరీస్‌కి గ్రీన్‌సిగల్ ఇచ్చాను' అని తెలిపింది.