Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం 'లాభం'. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అగ్ర దర్శకుడు బాబీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'విజయ్ సేతుపతి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆయన నటించిన సినిమాలు ఇప్పుడు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. 'సైరా.. నరసింహారెడ్డి, ఉప్పెన' చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది. 'లాభం' చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం ఉంది. ఇందులో ఆయన పాత్ర తన గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా ఉంటుందని ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో ఆయన కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం ఉంది. వినాయక చవితి కానుకగా ఈనెల 9న చాలా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అవుతోంది' అని చెప్పారు.
ఈ ఫస్ట్‌లుక్ ఆవిష్కరణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, కోన వెంకట్, చిత్ర నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్), సమర్పకుడు లాయర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జరు వర్మన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: ఎన్.కల్యాణ కష్ణన్, మ్యూజిక్: డి. ఇమ్మాన్, కెమెరా : రాంజీ, ఎడిటర్: గణేష్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్: వి.సెల్వకుమార్, స్టంట్: ధన అశోక్, రచన, దర్శకత్వం: ఎస్.పి.జననాథన్.