Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, తమన్నా హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీటీమార్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'సౌత్ కా సత్తా మార్ కే నై.. సీటీమార్ కే దిఖాయేంగే... అని హీరో గోపీచంద్ సవాలు విసురుతున్నారు. అసలు గోపీచంద్ ఆ రేంజ్లో ఎందుకు ఛాలెంజ్ విసిరారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈనెల 10న బాక్సాఫీస్‌తో కలెక్షన్ల్ కబడ్డీ ఆడటానికి సిద్ధమైన భారీ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది' అని చెప్పారు.
'ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్సా నీకు రూల్స్ తెలుసు కదా అని కబడ్డీ కోచ్ గోపీచంద్‌ను సెలక్టర్ ప్రశ్నిస్తే.., రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్.. రూట్ లెవల్ నుంచి ఆలోచించించి, పంపిస్తే పేపర్లో వస్తారు' అని గోపీచంద్ తనదైన స్టైల్లో చెప్పిన మాస్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు, డైలాగుల పరంపర అందర్నీ విశేషంగా అలరిస్తున్నాయి. అలాగే పవర్ఫుల్ డైలాగ్స్‌తో పాటు గోపీచంద్ యాక్షన్, కబడ్డీ ఆడే అమ్మాయిలు ఎంత బాగా ఆడారనే సన్నివేశాలు.. 'సీటీమార్' అనే బ్యాగ్రౌండ్లో వినిపించే టైటిల్ ట్రాక్ ఇవన్నీ సినిమాలో యాక్షన్, భారీతనంతో పాటు స్త్రీ సాధికారత గురించి మంచి మెసేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మాస్ హీరోయిజం, గ్లామర్‌తో పాటు ఈ సినిమాలో తమన్నా మంచి పెర్ఫామెన్స్ రోల్ చేశారు. ఇక దర్శకుడు సంపత్ నంది మరోసారి తనదైన మార్క్ మూవీని భారీ లెవల్లో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కించారు' అని చిత్ర బృందం తెలిపింది. భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అప్సర రాణి స్పెషల్ సాంగ్‌లో నటించింది.