Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపిక లీడ్ రోల్స్ చేసిన చిత్రం 'అశ్మీ'. సాచీ క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడు శేష్ కార్తీకేయ దర్శకత్వంలో స్నేహా రాకేష్ నిర్మించారు.
వైవిధ్యమైన థ్లిలర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముఖ్య పాత్రధారుల్లో ఒకరైన రుషికా రాజ్ మాట్లాడుతూ,'నేను కన్నడ అమ్మాయిని. కన్నడలో ఇప్పటికే మూడు సినిమాలు నటించాను. వాటిల్లో 'తగరు' మంచి గుర్తింపు నిచ్చింది. నేను హీరోయిన్గా అందరిలాగా చేయకూడదు, చేస్తే సొసైటీకి మంచి మెసేజ్ ఉండే క్యారెక్టర్ చేయాలనుకుని, చాలా కాలం వెయిట్ చేశాను. ఈ రోజుల్లో మహిళలు ఫేస్ చేేస్తున్న సమస్యల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. యాక్టింగ్‌కి మంచి స్కోప్ ఉన్న పాత్ర చేశాను. ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేని చిత్రమిది. కుటుంబం మొత్తం కలిసి హ్యాపీగా చూడొచ్చు. డైరెక్టర్ శేష్ కార్తికేయ చాలా మంచి స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. శివ, ప్రొఫెసర్, అశ్మీ అనే మూడు క్యారెక్టర్ల చుట్టూ సినిమా ఉంటుంది. ఇందులో ఉన్న ఒక సాంగ్‌కి శాండీ అద్దంకి మంచి మ్యూజిక్ ఇచ్చారు' అని తెలిపారు.